అక్షరటుడే, కామారెడ్డి : SERP Loans | ఈ ఏడాది చివరి లోపు స్త్రీనిధి రికవరీ శాతం సాధించాలని స్ట్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి (Streenidhi MD Vidyasagar Reddy) అన్నారు. డీఆర్డీవో, డీఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో సెర్ఫ్, స్త్రీనిధి కన్వర్జెన్స్ (StreeNidhi Convergence) సమావేశం నిర్వహించారు.
SERP Loans | సెర్ప్ రుణాల రికవరీలో ముందంజ
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. సెర్ప్ రుణాల రికవరీలో జిల్లా ముందంజలో ఉందని అభినందించారు. రెండు సంస్థల సిబ్బంది మధ్య ఏవైనా సమన్వయ లోపాలు ఉంటే, సరైన కో–ఆర్డినేషన్ ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. క్లస్టర్ వారీగా ఓవర్‌డ్యూ ఉన్న మహిళా సంఘాలు, సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. ఓవర్‌డ్యూ ఉన్న సిబ్బంది, మండలాలను సమీక్షించాలని సూచించారు.
ప్రతి మంగళవారం, గురువారం రోజులను రికవరీ డే (Recovery Day)గా పాటిస్తూ, అన్ని ఫంక్షనరీలు రికవరీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. 180 రోజులకు మించి డిఫాల్ట్ అయిన అన్ని సంఘాలను సమీక్షించి, వాటి హార్డ్ కాపీలను సంబంధిత సీపీలకు అందజేయాలన్నారు. ప్రతివారం పురోగతిని సమీక్షిస్తూ తక్కువ పనితీరు ఉన్న సిబ్బందిపై దృష్టి సారించి, మార్చి 2026 చివరి నాటికి 95 శాతానికి పైగా రికవరీ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్ (DRDO Surender), అడిషనల్ డీఆర్డీవో, డీపీఎంలు, స్త్రీనిధి డైరెక్టర్, స్త్రీనిధి జోనల్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.