అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal | లయన్స్ క్లబ్ (Lions Club) సభ్యులు ఎల్లప్పుడూ సమాజ సేవలో ముందుండాలని, సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక మార్పునకు దోహదపడాలని డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్‌నాథ్ సూచించారు.
భీమ్‌గల్ వేముగల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఎల్‌జె గార్డెన్‌లో ‘లయన్స్ లీడర్‌షిప్ ఇన్‌స్టిట్యూట్ (LLI)’ కార్యక్రమం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాల ద్వారా సభ్యులు సేవా భావనతో ముందుకు సాగాలన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న బసవేశ్వర్ లయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, భీమ్‌గల్ వేముగల్లు క్లబ్ సేవా పరిధిని మరింత విస్తరించాలన్నారు.
క్లబ్ నూతన అధ్యక్షుడిగా పడాల పురేందర్, కార్యదర్శిగా గజ్జల చైతన్య, కోశాధికారిగా ఎడ్ల శేఖర్ ప్రమాణం చేశారు. సేవా మార్గంలో సమాజాభివృద్ధే తమ లక్ష్యమని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పురస్తు బద్రి, శ్రీకాంత్, హన్మాండ్లు, ప్రసాద్, లింబాద్రి, రమేష్, హనుమంతు, జితేందర్, శ్రీనివాస్, మధు, సాగర్, సుధాకర్, ఇమాన్వల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.