అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | అమెరికా టారిఫ్‌ల భయం మార్కెట్‌ను వీడడం లేదు. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర పెరుగుతుండగా.. రూపాయి విలువ బలహీనమవుతూనే ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు భయంతో అమ్మకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో మన మార్కెట్లలో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి.
శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 158 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 384 పాయింట్లు పెరిగి కాసేపు లాభాల బాటలో సాగింది. అయితే ఇన్వెస్టర్లు భయాలతో అమ్మకాలకు పాల్పడడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 699 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 100 పాయింట్లు ఎగబాకింది. గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో ఒక్కసారిగా పతనమై 195 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 432 పాయింట్ల నష్టంతో 83,748 వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల నష్టంతో 25,743 వద్ద ఉన్నాయి.
పవర్ స్టాక్స్‌లో కొనసాగుతున్న ఒత్తిడి..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో పవర్, సర్వీసెస్, రియాలిటీ, యుటిలిటీ తదితర సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్ 2.02 శాతం, పవర్ 1.19 శాతం, సర్వీసెస్ 1.08 శాతం, యుటిలిటీ 0.89 శాతం, ఇన్‌ఫ్రా 0.71 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.65 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.60 శాతం, ఆటో 0.53 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్ 1.06 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.51 శాతం, ఐటీ ఇండెక్స్ 0.28 శాతం, పీఎస్‌యూ 0.24 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.12 శాతం లాభంతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.73 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.46 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్ 1.62 శాతం, ఆసియా పెయింట్ 1.16 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.00 శాతం, బీఈఎల్ 0.94 శాతం, ఎస్‌బీఐ 0.67 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) 2.19 శాతం, అదాని పోర్ట్స్ 1.81 శాతం, మారుతి 1.25 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.06 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.05 శాతం నష్టాలతో ఉన్నాయి.