అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | గ్రీన్ ల్యాండ్ (Green Land) విషయంలో భోగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పడుతుండడం, భారత్‌తో ట్రేడ్ డీల్ విషయంలో యూఎస్ ప్రెసిడెంట్ సానుకూల ప్రకటన చేయడంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గ్యాపఅప్‌లో ప్రారంభమై భారీ లాభాల దిశగా సాగుతున్నట్లు కనిపించినా.. ఇన్వెస్టర్ల ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.
గురువారం ఉదయం సెన్సెక్స్ 550 పాయింట్ల భారీ గ్యాపఅప్‌లో ప్రారంభమై అక్కడినుంచి మరో 324 పాయింట్లు పెరిగింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో 802 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 991 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 234 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో 82,145 వద్ద, నిఫ్టీ (Nifty) 83 పాయింట్ల లాభంతో 25,240 వద్ద ఉన్నాయి.
పీఎస్‌యూలో ర్యాలీ..
బీఎసఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.91 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.37 శాతం, పీఎస్‌యూ 1.22 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.15 శాతం, ఇన్‌ఫ్రా 1.03 శాతం, హెల్త్‌కేర్ 1 శాతం, ఎఫఎంసీజీ 0.92 శాతం, మెటల్ 0.91 శాతం, ఇండస్ట్రియల్ 0.89 శాతం ఐటీ ఇండెక్స్ 0.82 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 0.49 శాతం, టెలికాం 0.26 శాతం, కమోడిటీ 0.09 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.69 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Gainers : బీఎసఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ఉండగా.. 6 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. అదానిపోర్ట్ట్స్ 2.53 శాతం, బీఈఎల్ 2.40 శాతం, టాటా స్టీల్ 2.25 శాతం, ఎస్‌బీఐ 1.62 శాతం, ఆసియన్ పెయింట్ 1.14 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఐసీఐసీఐ బ్యాంక్ 0.36 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.330 శాతం, ఎటర్నల్ 0.28 శాతం, టైటాన్ 0.28 శాతం, ఎంఅండఎం 0.19 శాతం నష్టాలతో ఉన్నాయి.