అక్షరటుడే, లింగంపేట: Lingampet | పంచాయతీ ఎన్నికల్లో (local body elections) లింగంపేట మండలం ఆదర్శంగా నిలిచింది. రెండో విడత నామినేషన్ల విత్డ్రా పక్రియ ముగియగా.. లింగంపేట మండలంలోని (Lingampeta mandal) 41 పంచాయతీల్లో 13 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
మండలంలోని రాంపల్లి, రాంపల్లి తండా, మెంగారం, ముంబాజిపేట్ తండా, బానాపూర్ తండా, బానాపూర్, నల్లమడుగు పెద్ద తండా, లింగంపల్లి కుర్దు, ఎల్లారం, మాలోత్ తండా, మాలోత్ సంగ్యా నాయక్ తండా, అయ్యపల్లి తండా, సజ్జన్ పల్లి గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి.
