అక్షరటుడే, వెబ్డెస్క్ : Akhanda 2 | బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అఖండ –2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు (Madras High Court) రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ ప్రకటించనుంది.
బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం (Director Boyapati)లో తెరకెక్కిన అఖండ 2 ఈ నెల 5న విడుదల కావాల్సి ఉంది. 4న ప్రీమియర్ షోతో పాటు రిలీజైన తర్వాత టికెట్ల ధరల పెంపునకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి. సాంకేతిక కారణాలతో ప్రీమియర్స్ వాయిదా వేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. మరికొద్ది గంటల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు ఈ నెల 5న ప్రకటిచింది.
Akhanda 2 | బకాయిల కోసం..
ఎరోస్ సంస్థకు అఖండ 2 (Akhanda 2) నిర్మాణ సంస్థ 14 రీల్స్ రూ.27 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వడ్డీతో కలిపి ఇవి రూ.50 కోట్లు అయినట్లు సమాచారం. ఈ క్రమంలో తమ బకాయిలు చెల్లిస్తేనే సినిమా బాలయ్య (Hero Balakrishna) సినిమా విడుదల చేస్తామని ఎరోస్ ప్రకటించింది. దీంతో విడుదల వాయిదా పడటంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు లోన్ అయ్యారు. అ క్రమంలో తాజాగా మద్రాస్ హైకోర్టు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ నెల 12న మూవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. 11న ప్రీమియర్ షోలు ఉంటాయని తెలుస్తోంది. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.