Homeబిజినెస్​Triumph Speed Triple 1200 RX | ట్రయంఫ్‌ నుంచి లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌.. 1200...

Triumph Speed Triple 1200 RX | ట్రయంఫ్‌ నుంచి లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌.. 1200 యూనిట్లు మాత్రమే!

ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్స్‌(Triumph Motorcycles) కంపెనీ స్పీడ్‌ ట్రిపుల్‌ 1200 ఆర్‌ఎక్స్‌ బైక్‌ను గురువారం(అక్టోబర్‌ 16న) విడుదల చేసింది. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌. ప్రపంచవ్యాప్తంగా 1,200 బైక్‌లను మాత్రమే విక్రయించనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Triumph Speed Triple 1200 RX | ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్‌ కంపెనీ ఈ ఏడాది తొలినాళ్లలో స్పీడ్‌ ట్రిపుల్‌ 1200 ఆర్‌ఎక్స్‌(Speed Triple 1200 RX) బైకును ఆవిష్కరించింది. తాజాగా ఈ మోడల్‌ను లాంచ్‌ చేసింది. దీనిని స్పీడ్‌ ట్రిపుల్‌ 1200 ఆర్‌ఎస్‌ ఆధారంగా రూపొందించారు.

ఓహ్లిన్స్‌(Ohlins) ఎలక్ట్రానిక్‌ స్టీరింగ్‌ డ్యాంపర్‌, అక్రాపోవిక్‌ ఎగ్జాస్ట్‌, కార్బన్‌ ఫైబర్‌ భాగాలు, మరియు మరింత దూకుడుగా ఉండే క్లిప్‌ ఆన్‌ హ్యాండిల్‌ బార్స్‌ వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ఇది లేత పసుపు, నలుపు రంగుల కలయికతో చూడచక్కగా ఉంది. దీని ఎక్స్‌ షోరూమ్‌(Ex Showroom) ధర రూ. 23.07 లక్షలు. అయితే ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌. ప్రపంచవ్యాప్తంగా 1200 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. ఇందులో భారత దేశానికి ఎన్ని యూనిట్లు కేటాయించిందో వెల్లడిరచలేదు.

ఇంజిన్‌ : ఇది 1160 సీసీ ఇంజిన్‌తో 180.5 హార్స్‌పవర్‌, 128 ఎన్‌ఎం(NM) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ ఉంది.

సస్పెన్షన్‌ : ముందు మరియు వెనుక భాగంలో ఓహ్లిన్స్‌(Ohlins) ఈసీ3 సెమీయాక్టివ్‌ సస్పెన్షన్‌ అమర్చారు.

రైడిరగ్‌ పొజిషన్ : స్పోర్టీ రైడిరగ్‌ (Sporty Riding Rug)కోసం క్లిప్‌ఆన్స్‌ ఉన్నాయి. రీర్‌సెట్స్‌ మరింత దూకుడుగా ఉండే రైడిరగ్‌ పొజిషన్‌ను అందిస్తుంది.