అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ananya Panday | టాలీవుడ్‌ను టార్గెట్ చేసుకుని ‘లైగర్’ సినిమా (Liger Movie)తో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు మార్కెట్‌లో పట్టు సాధిస్తానన్న ధీమాతోనే అడుగుపెట్టింది. కానీ పరిస్థితి పూర్తిగా ఊహించని దిశలో మలుపు తిరిగింది.
‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు టాలీవుడ్ (Tollywood)లో ఆశించిన స్థాయి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె దృష్టి మళ్లీ పూర్తిగా బాలీవుడ్‌పైనే కేంద్రీకృతమైంది. తెలుగులో మరోసారి అవకాశం అందుకొని ఓ చిన్న సినిమా చేయడం, దాని ఫలితం కూడా ఆశించిన విధంగా లేకపోవడం అనన్యను కాస్త ఇబ్బంది పెట్టింది. ఇకపై కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, ప్రతి ప్రాజెక్ట్‌ను ఆలోచించి ఎంచుకుంటానని ఆమె సన్నిహితుల దగ్గర చెప్పినట్టు టాక్ వినిపించింది.
Ananya Panday | క్రేజ్ అలా ఉంది మరి..
ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ ముంబై ఇండస్ట్రీ (Mumbai Industry)లోనే తన స్థానం బలపర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది. అనుకున్నట్టుగానే బాలీవుడ్‌లో ఆమెకు ఆరంభంలో మంచి బ్రేక్‌లు వచ్చాయి. ‘రాకీ ఔర్ రానీ కి ప్రేమ్ కహానీ’లో స్పెషల్ సాంగ్‌తో కనిపించి యూత్‌ను ఆకట్టుకుంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో అనన్యకు మంచి విజిబిలిటీ దక్కింది. వెంటనే హీరోయిన్‌గా నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆమె ఖాతాలో మరో హిట్ చేరింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు మాత్రం మిశ్రమంగా మారాయి. ‘ఖో గయే హమ్ కహానా’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ‘బ్యాడ్ న్యూజ్’లో మరోసారి స్పెషల్ సాంగ్‌తో మెరిసినా, హీరోయిన్‌గా నటించిన ‘సీటీఆర్ ఎల్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అంతేకాదు ‘కేసరి చాప్టర్ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇటీవల విడుదలైన ‘తూ మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తూ మేరీ’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, పెట్టుబడిలో సగం కూడా రికవర్ చేయలేకపోయింది.
అన్ని ప్లాఫ్ల మధ్య కూడా అనన్య పాండే కెరీర్ ఆగలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ల లైనప్ చూసి ఇండస్ట్రీలోనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఆమె నటిస్తున్న ‘చాంద్ మేరా దిల్’ షూటింగ్ దశలో ఉంది. అంతేకాదు, మరో మూడు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఒక సినిమా, ధర్మ ప్రొడక్షన్స్‌లో మరో ప్రాజెక్ట్, అలాగే టీ-సిరీస్ – బీఆర్ స్టూడియోస్ కలయికలో రెండు చిత్రాలకు అగ్రిమెంట్ కుదిరిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.