అక్షరటుడే, బాల్కొండ: life imprisonment | నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిధిలోని వన్నెల్–బీ గ్రామంలో భార్యను హత్య చేసిన కేసులో భర్తకు కోర్టు జీవిత కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.
బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలికి చెందిన జుంగా రాజు గంగారాం (34) డిసెంబర్, 2024లో వన్నెల్–బీ గ్రామంలో తన భార్యను హత్య చేసినట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
life imprisonment | నేరం నిరూపితం కావడంతో..
ఈ మేరకు బాల్కొండ పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి, సీఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం నేరస్తుడిని అరెస్టు చేసి, కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది వసంత్ సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మహిళా కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్.. నిందితుడికి జీవిత కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.