289
అక్షరటుడే, ఇందూరు: Former BJP corporator Pravalika | నిజామాబాద్ నగరం Nizamabad city లో కార్పొరేషన్ ఎన్నికలు సరవత్తరంగా సాగుతున్నాయి. ఆశావహులు ఇటీవలే పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, బీ ఫారం రాని అభ్యర్థులు పార్టీలు దూకుతున్నారు.
Former BJP corporator Pravalika |
తాజాగా బీజేపీ మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక, శ్రీధర్ కాంగ్రెస్ గూటికి చేరారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ PCC Chief Mahesh Kumar Goud వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ప్రవళిక బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో భంగపడ్డారు. దీంతో కాంగ్రెస్ గూటికి చేరినట్లు ప్రచారంలో ఉంది.