అక్షరటుడే, ఎల్లారెడ్డి: Local Body Elections | కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ఆయా గ్రామాల ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు (MLA Madan Mohan Rao) పేర్కొన్నారు. ఎల్లారెడ్డి డివిజన్లో (Yellareddy division) పలు గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం వారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా (Sarpanchs) ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. తమ గ్రామాల్లో పోటీల్లేకుండా అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసుకొని అభివృద్ధి బాటలు వేసుకున్న గ్రామస్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (Yellareddy constituency) 46 గ్రామాలలో ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకోవడం..కామారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో చర్చకు తెరలేపిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.