Armoor | సిద్దులగుట్టపై చిరుత సంచారం కలకలం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Armoor | ఆర్మూర్​లోని సిద్దులగుట్టపై siddula gutta పై చిరుత సంచారం కలకలం రేపింది. గుట్టపై చిరుత పులి సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. సోమవారం సిద్దుల గుట్టకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డుపై గుట్టకు భక్తులు వెళ్తుండగా.. కొండపై చిరుత కనిపించడంతో సెల్​ఫోన్​లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా.. ఆలయ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Armoor | ఆర్మూర్​లోని సిద్దులగుట్టపై siddula gutta పై చిరుత సంచారం కలకలం రేపింది. గుట్టపై చిరుత పులి సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

సోమవారం సిద్దుల గుట్టకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డుపై గుట్టకు భక్తులు వెళ్తుండగా.. కొండపై చిరుత కనిపించడంతో సెల్​ఫోన్​లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా.. ఆలయ కమిటీ సభ్యులు సిద్దుల గుట్టపై చిరుత పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎఫ్ఆర్​వో శ్రీనివాస్​ మాట్లాడుతూ.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఉదయం సిబ్బందితో కలిసి చిరుత జాడ కోసం గాలిస్తామన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...