అక్షరటుడే, ఎల్లారెడ్డి: Leopard roaming | కామారెడ్డి జిల్లాలో మరోమారు చిరుత సంచారం కలకలం రేపింది. ఏకంగా రహదారిపైనే సంచరించడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
లింగంపేట మండలం మిద్ద మెట్టు వద్ద ఎల్లారెడ్డి – కామారెడ్డి రహదారిపై చిరుత సంచరిస్తుండగా స్థానికులు, ప్రయాణికులు గుర్తించి భయపడిపోయారు.
చిరుత సంచారాన్నిఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.
Leopard roaming | ఇటీవలే పోలీసులు..
మిద్ద గట్టు వద్ద చిరుత పులిని గమనించిన ఆర్టీసీ డ్రైవరు బస్సును నిలిపివేశారు. కాగా రెండు రోజుల క్రితం మెంగారం గ్రామం వద్ద కూడా చిరుత ఎల్లారెడ్డి- కామారెడ్డి ప్రధాన రహదారిని దాటుతుండగా పోలీసులు మొబైల్ ఫోన్లో ఫొటోలు తీయడం గమనార్హం.
