అక్షరటుడే, లింగంపేట: Leopard on KKY road | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తరచూ చిరుతలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎన్‌హెచ్–44పై ఇందల్వాయి సమీపంలో ఓ చిరుత (Leopard) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సైతం సంచరించింది. కొన్ని నెలల క్రితం ఆర్మూర్‌లోని సిద్ధుల గుట్టపై రోడ్డు పక్కన చిరుత కనిపించిన విషయం తెలిసిందే. ఇలా చిరుతలు పలుమార్లు తారసపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. ఇక్కడ కొన్ని రోజులుగా చిరుత తరచూగా కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
Leopard on KKY road | ఎల్లారెడ్డి – లింగంపేట రోడ్డులో..
కేకే వైరహదారిపై ఎల్లారెడ్డి – లింగంపేట మధ్యలో ఉన్న అడవి ప్రాంతంలో చిరుత సంచరించింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహన చోదకులు జంకుతున్నారు. మంగళవారం తెల్లవారు 3:30 గంటలకు లింగంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాజిద్ ఖాన్ ఎల్లారెడ్డి నుంచి లింగంపేటకు వస్తుండగా మెంగారం అడవి ప్రాంతంలో చిరుత రోడ్డుపైకి రావడంతో కారును నిలిపి వేసుకున్నట్లు తెలిపారు. ఈ రోడ్డుపై వానచోదకులు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.
Leopard on KKY road | భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులు
గత నెల రోజులుగా చిరుత రోడ్డుపై కనబడుతుండడంతో వాహన చోదకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది ఇప్పటివరకు గుర్తులు గాని, బోర్డులు ఏర్పాటు చేయలేదు. కేకేవై రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కావున అటవీశాఖ సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలని వాహనచోదకులు, సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
View this post on Instagram