Homeజిల్లాలుకరీంనగర్Panchayat Elections | సాఫ్ట్​వేర్​ కొలువులు వదిలి.. సర్పంచ్​గా పోటీ

Panchayat Elections | సాఫ్ట్​వేర్​ కొలువులు వదిలి.. సర్పంచ్​గా పోటీ

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలు వదిలి మరి స్థానిక ఎన్నికల బరిలో దిగుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. నేటి నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. డిసెంబర్​ 2 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. సర్పంచ్​గా పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

రాష్ట్రంలో సర్పంచ్​ ఎన్నికలు (Sarpanch Elections) 18 నెలల ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోటీకి పలువురు యువత ముందుకు వస్తున్నారు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డవారు సైతం ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మెదక్​ జిల్లా (Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ సర్పంచ్​గా పోటీ చేయడానికి సిద్ధం అయ్యారు. అమెరికాలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం వదులుకొని ఆయన పోటీ చేయడానికి వచ్చారు. ఈ గ్రామంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఊరి కోసం తన తాత చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చంద్రశేఖర్​ తెలిపారు.

Panchayat Elections | కరీంనగర్​లో..

కరీంనగర్ జిల్లా (Karimnagar District) కొత్తపల్లి మండలం నాగులమల్యాలలో ఓ యువతి సర్పంచ్​గా పోటీ చేయడానికి నామినేషన్ వేసింది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగం (Software Employee) చేస్తున్న ఆమె తన కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగింది. లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి గ్రామ సేవ లక్ష్యంగా జాహ్నవి పోటీకి సిద్ధం అవుతోంది. కాగా ఆమె గతంలో విద్యార్థి నాయకురాలిగా పని చేశారు.

Panchayat Elections | ఎస్సై సైతం..

కోదాడ ఎస్సై పులి వెంకటేశ్వర్లు (Kodada SI Puli Venkateswarlu) సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం స్వచ్ఛంద పదవి విరమణ చేసిన విషయం తెలిసిందే. ఇంకా 5 నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు. పుట్టిన ఊరికి సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కోదాడ మండలం గుడిబండ ఆయన స్వగ్రామం. అక్కడ రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, నామినేషన్​ వేయడానికి సిద్ధం అయ్యారు.

Must Read
Related News