DGP Jitender | వెంటనే తెలంగాణను వీడండి.. పాక్​ పౌరులకు డీజీపీ హెచ్చరిక
DGP Jitender | వెంటనే తెలంగాణను వీడండి.. పాక్​ పౌరులకు డీజీపీ హెచ్చరిక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DGP Jitender | తెలంగాణ Telanganaలో ఉన్న పాకిస్తాన్​ పౌరులు pakistani citizens వెంటనే వారి దేశానికి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్​ dgp jitendar హెచ్చరించారు. పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాకిస్తాన్​ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా amit sha ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్​ చేసి పాక్​ పౌరులను వెంటనే పంపించివేయాలని సూచించారు.

తెలంగాణ డీజీపీ జితేందర్ dgp jitender ​శుక్రవారం పాక్​ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 27 తర్వాత వీసాలు visa రద్దవుతాయని, ఆ లోగా వెళ్లిపోవాలన్నారు. మెడికల్‌ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వీసాలు రద్దయిన తర్వాత అక్రమంగా రాష్ట్రంలో ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ Hyderabadలో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారని, వారిపై నిఘా పెట్టామని తెలిపారు.

ఆంక్షల నేపథ్యంలో భారత్‌, పాక్‌ పౌరులు స్వదేశాలకు చేరుకుంటున్నారు. అటారీ బోర్డర్ atari boarder​ నుంచి 120 మంది భారత పౌరులు స్వదేశానికి వచ్చారు. మరోవైపు వాఘా సరిహద్దు wagha boarder నుంచి 180 మంది పాక్ పౌరులు వారి దేశానికి వెళ్లారు.