అక్షరటుడే, ఇందూరు: Giriraj College | ఎన్సీసీతో (NCC) నాయకత్వ లక్షణాలు అలవడుతాయని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లకేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎన్సీసీ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్సీసీతో దేశభక్తి, సమాజసేవ దోహదపడుతుందన్నారు. వ్యక్తిత్వ నిర్మాణంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. శిక్షణలో శారీరక మానసిక దృఢత్వం అలవాటు అవుతుందన్నారు. అనంతరం క్యారెక్టర్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, కెప్టెన్ బాబురావు, డాక్టర్ రంజిత, తదితరులు పాల్గొన్నారు.
