Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం తగదు: ఎస్పీ

Kamareddy SP | శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం తగదు: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం తగదని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం తగదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల (pending cases) వివరాలను ఆరా తీశారు.

గ్రేవ్ కేసుల్లో ఎస్​వోపీ ప్రకారం.. నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు జరిపి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. లాంగ్-పెండింగ్ కేసుల (long-pending cases) ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలని సూచించారు. ఎస్​హెచ్​వోలు తమ ఏరియాలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి, ఆ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకోవాలని చెప్పారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందస్తు సమాచారాన్ని సేకరించి, చిన్న ఘటనకైనా సమాచారం వచ్చే విధంగా గ్రామస్థులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Kamareddy SP | ప్రజలను చైతన్యం చేయాలి

రౌడీ షీటర్స్, సస్పెక్ట్​ల కదళికపై నిఘా ఉంచి తరుచూ చెక్ చేయాలన్నారు. బ్లూకోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ (Blue Colts and night patrolling) సిబ్బంది పాపిలోన్ డివైస్​లను వినియోగిస్తూ అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించాలని చెప్పారు. వుమెన్ సేఫ్టీ, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్​లైన్​ మోసాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కలిపిస్తూ వారిని చైతన్యం చేయాలన్నారు. డ్రంకన్​డ్రైవ్ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలను రాష్‌గా నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని చెప్పారు. డీజీపీతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో (video conference) జిల్లా పోలీసులు పార్థీ గ్యాంగులను పట్టుకోవడంలో చూపిన చురుకుదనాన్ని ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.

Kamareddy SP | స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడమే లక్ష్యం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. ప్రతి పోలీస్ అధికారి గ్రామాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు. సోషల్ మీడియాలో అసాంఘిక ప్రచారంపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. చెడు ప్రవర్తన గల వారిపై బైండోవర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు ప్రజలతో మమేకమై సమాచారం సేకరించి.. ఎన్నికల వాతావరణాన్ని భద్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.

సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి (Additional SP Narasimha Reddy), కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసరావు, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మదూసుధన్, డీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ మురళి, పీసీఆర్​ ఇన్​స్పెక్టర్​ నరేశ్​, సీసీఎస్​ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.