అక్షరటుడే, కామారెడ్డి : DETA | దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ క్యాలెండర్ను హైదరాబాద్లో (Hyderabad) శుక్రవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి (Pulagam Damodar Reddy) ఆధ్వర్యంలో పీఆర్టీయూ కార్యాలయంలో విడుదల చేశారు.
DETA | దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయులకు వెన్నంటి ఉండి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం కృషి చేస్తున్న జంగం శ్రీశైలంను అభినందించారు. కార్యక్రమంలో దివ్యాంగ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అసోసియేషన్ (Association of Disabled Employees and Teachers) రాష్ట్ర అధ్యక్షుడు జంగం శ్రీశైలం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ లింగయ్య యాదవ్, సలహాదారులు డాక్టర్ సూర్యం, రాజ్ కుమార్, ప్రతినిధులు ఇంతియాజ్, సంతోష్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.