అక్షరటుడే, పెద్దకొడప్గల్: Local Body elections | పంచాయతీ ఎన్నికల (panchayat elections) నేపథ్యంలో మండలంలో సందడి నెలకొంది. ముఖ్యంగా శుక్రవారం నామినేషన్ల సమర్పణకు చివరిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు క్యూకట్టారు.
సర్పంచ్, వార్డు మెంబర్ల (sarpanch and ward members) స్థానాలకు నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థులు తరలిరావడంతో కేంద్రాలు సందడిగా మారాయి. అధికారులు సైతం అభ్యర్థులకు హెల్ప్‌డెస్క్ ద్వారా సూచనలు సలహాలు అందజేస్తున్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
