Homeఅంతర్జాతీయంPakistan | లష్కరే తోయిబా కవ్వింపులు.. ప్రధాని మోదీకి బెదిరింపులు

Pakistan | లష్కరే తోయిబా కవ్వింపులు.. ప్రధాని మోదీకి బెదిరింపులు

లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్​ సైఫుల్లా కసూరి కవ్వింపులకు పాల్పడ్డాడు. ప్రధాని మోదీకి మరోసారి గుణపాఠం చెప్పాలని ఆ దేశ ఆర్మీ చీఫ్​ను ఆయన కోరాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor)తో చావు దెబ్బ తిన్నా.. పాకిస్థాన్​, ఆ దేశంలోని ఉగ్రవాదులకు ఇంకా బుద్ది రావడం లేదు. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్​ సైఫుల్లా కసూరి కవ్వింపులకు పాల్పడ్డాడు.

పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) సూత్రదారి అయిన సైఫుల్లా పాక్​లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏకంగా ప్రధాని మోదీ (PM Modi)ని బెదిరించడం గమనార్హం. మరోసారి పహల్గామ్​లాంటి దాడి చేస్తామని అన్నాడు. కసూరి మాట్లాడుతూ.. భారత్​ నీటి ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించాడు. ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్​లో వరదలు రావడానికి కారణం అవుతోందన్నాడు. ‘‘మే 10న మనం చేసినట్లుగా మోదీకి పాఠం నేర్పించండి”అని ఆ దేశ ఆర్మీ చీఫ్​ను కోరాడు.

Pakistan | ప్రతీకారం తీర్చుకుంటాం

కసూరి వ్యాఖ్యలు పాక్​ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వరద సహాయక చర్యల పేరుతో ఆయన పర్యటిస్తూ.. భారత్​పై విష ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల వరదలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశాడు. పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడానికి, ఉగ్రవాద చొరబాటులను ప్రోత్సహించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

Pakistan | చావు దెబ్బ తిన్నా..

పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్​ 22న పహల్గామ్​లో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి భారత్​ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం పాక్​ దాడికి దిగితే ధీటుగా బదులిచ్చింది. పాక్​ యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఆ దేశంలోని ఎయిర్​ బేస్​లను సైతం భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. యుద్ధంలో చావు దెబ్బ తిన్నా పాకిస్థాన్​ బయటకు మాత్రం తామే గెలిచామని చెప్పుకుంటోంది. భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు ప్రచారం చేసుకుంటుంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు బలోచిస్తాన్​ వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్​ భారత్​పై విష ప్రచారం మాత్రం మానడం లేదు. సొంత దేశాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి ఉగ్రవాదులను భారత్​పైకి ఉసిగొల్పుతోంది.

Must Read
Related News