ePaper
More
    Homeక్రైంHyderabad | భారీగా నకిలీ మందుల స్వాధీనం

    Hyderabad | భారీగా నకిలీ మందుల స్వాధీనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | డ్రగ్​ కంట్రోల్​ అధికారులు భారీగా నకిలీ మందులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లోని మూసారాంబాగ్ లైసెన్స్​ లేకుండా మందులు విక్రయిస్తున్న ఓ వ్యక్తి ఇంటిపై అధికారులు గురువారం దాడి చేశారు.

    ఈ దాడిలో రూ.5.21 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. పువ్వాడ లక్ష్మణ్​ అనే వ్యక్తి వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ స్టాక్‌లో యాంటీ-డయాబెటిక్ డ్రగ్స్, యాంటీ హైపర్‌టెన్సివ్స్, అబార్షన్ కిట్‌లు ఉన్నాయి. ఈ మేరకు నకిలీ మందులను స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేశారు. కాగా.. లక్ష్మణ్​పై గతంలో సైతం నకిలీ మందుల కేసులు పెండింగ్​లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మందులు వినియోగిస్తే ప్రజల ఆరోగ్యానికి హానికరమని వారు పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తునట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...