అక్షరటుడే, వెబ్డెస్క్ : Karnataka | కర్ణాటకలో కొందరు మళ్లీ భాషా వివాదానికి తెరలేపారు. తెలుగు బోర్డులను తొలగిస్తున్నారు. దుకాణాలు, షాపింగ్ మాళ్ల పేర్లు తెలుగులో ఉంటే తీసేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది.
కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి విజయనగర జిల్లా (Vijayanagara District) అధ్యక్షుడు జి. రాజశేఖర్ రాజన్న ఆధ్వర్యంలో తెలుగు అక్షరాలను సైన్ బోర్డులను తొలగించారు. ఓ షాపింగ్ మాల్ (Shopping Mall)కు తెలుగులో ఉన్న పేరు తొలగించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కన్నడలో బోర్డులు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇక్కడ ఏ భాషలో బోర్డులు ఉన్నా.. ఎవరు తొలగించరని కామెంట్లు చేస్తున్నారు.
కానీ తెలుగు బోర్డులను తొలగించడం సరికాదని మండిపడుతున్నారు. కొంతమంది కర్ణాటక ప్రజలు సైతం ఆ వీడియోను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిసి మెలసి ఉంటున్న తెలుగు, కన్నడ ప్రజల మధ్య రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలు సరికాదని హితవు పలుకుతున్నారు. పని పాట లేని వారు ఇలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తారని మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Karnataka Rakshana Vedike Ballari–Vijayanagara District President G. Rajashekar Rajanna led the removal of #Telugu letters from the signboard.#Karnatakapic.twitter.com/uOrFLShu3G
— Milagro Movies (@MilagroMovies) December 5, 2025
