అక్షరటుడే, బాన్సువాడ: Banswada Town | పట్టణంలోని కూరగాయల మార్కెట్లో (vegetable market) సోమవారం స్కూటీ డిక్కీలో నుంచి రూ. లక్ష అపహరణకు గురైన ఘటన వెలుగు చూసింది. తాడ్కోల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో సాయిరెడ్డి బ్యాంకులో నుంచి రూ. లక్ష డ్రా చేసి స్కూటీ డిక్కీలో (vegetable market) పెట్టుకున్నాడు. ఓ దుండగుడు బ్యాంకు నుంచి గమనిస్తూ సాయిరెడ్డి వెనుక వెళ్లాడు. కూరగాయలు కొనుగోలు చేస్తున్న సమయంలో డిక్కీలో నుంచి రూ. లక్ష మాయం చేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు.
Banswada Town | స్కూటీ డిక్కీలో నుంచి రూ. లక్ష అపహరణ
- Advertisement -
