Homeజిల్లాలునిజామాబాద్​Velpur mandal | కాంగ్రెస్‌లో చేరిన ఉద్యోగ సంఘం నాయకుడు

Velpur mandal | కాంగ్రెస్‌లో చేరిన ఉద్యోగ సంఘం నాయకుడు

ఉద్యోగ సంఘ నాయకుడు సుభాష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం హర్షనీయమని టీపీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​ అన్నారు. ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన లక్కోర గ్రామానికి చెందిన సుభాష్​ కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

- Advertisement -

అక్షరటుడే, భీమ్‌గల్‌: Velpur mandal | వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామానికి చెందిన సుభాష్‌ ఇటీవల మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ విరమణ పొందాడు. కాగా ఆయన గురువారం కాంగ్రెస్‌ పార్టీలో (Congress party) చేరాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు.

దీంతో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ (Mahesh Kumar Goud) ఆయనకు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘ నాయకుడు సుభాష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం హర్షనీయమన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి (Manala Mohan Reddy), స్టేట్‌ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ మార గంగారెడ్డి, సీడ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ రమేష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.