Kukatpally fire broke out | కూకట్​పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ఫిల్లింగ్​ సెంటర్​లో పేలిన గ్యాస్​ సిలిండర్​.. వ్యాపించిన మంటలు!

అక్షరటుడే, హైదరాబాద్​: Kukatpally fire broke out | హైదరాబాద్ కూకట్​పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూకట్‎పల్లి రాజీవ్ గాంధీ నగర్‎లో ఉన్న ఓ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో మంగళవారం (జనవరి 13) రాత్రి  ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సిలిండర్​ రీఫిల్​ చేస్తుండగా గ్యాస్ లీక్​ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక […]

అక్షరటుడే, హైదరాబాద్​: Kukatpally fire broke out | హైదరాబాద్ కూకట్​పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూకట్‎పల్లి రాజీవ్ గాంధీ నగర్‎లో ఉన్న ఓ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో మంగళవారం (జనవరి 13) రాత్రి  ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సిలిండర్​ రీఫిల్​ చేస్తుండగా గ్యాస్ లీక్​ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

Kukatpally fire broke out | వరుస పేలుళ్లు..

కూకట్​పల్లి ప్రమాదంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు ఎనిమిది సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రీఫిల్లింగ్ స్టేషన్ సమీపంలో ఉన్న స్థానిక ప్రజలను ఖాళీ చేయించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...