Homeతాజావార్తలుCM Revanth Reddy | బీఆర్​ఎస్​కు కేటీఆర్ గుదిబండ.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy | బీఆర్​ఎస్​కు కేటీఆర్ గుదిబండ.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నల్గొండ జిల్లా దేవరకొండలో సీసం రేవంత్​రెడ్డి పర్యటించారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | బీఆర్​ఎస్​కు కేటీఆర్​ గుదిబండ అని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేటీఆర్​ ఉన్నంతకాలం బీఆర్​ఎస్​ (BRS) గెలవదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా (Nalgonda district) దేవరకొండలో సీసం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. దేవరకొండ గడ్డ (Devarakonda Gadda) కాంగ్రెస్‌ అడ్డా అన్నారు. నిజాం నవాబులను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పేదలకు న్యాయం జరిగిందని చెప్పారు.

CM Revanth Reddy | కేసీఆర్​పై విమర్శలు

తెలంగాణకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఇటీవల మాజీ సీఎం కేసీఆర్​ (KCR) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్​రెడ్డి ఆయన వ్యాఖ్యలకు కౌంటర్​ ఇచ్చారు. పదేళ్ల దోపిడీ చాలలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్​ కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని పీక్కు తిన్నారని విమర్శించారు. బీఆర్ఎస్‎కు కేటీఆరే గుదిబండ అన్నారు. ఆయన ఉన్నంత కాలం ప్రజలు ఆ పార్టీని బండకేసి కొడతానే ఉంటారని చెప్పారు.

CM Revanth Reddy | సర్పంచులను కలుస్తున్నారు

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​ ఎవరిని కలిసే వారు కాదని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం అపాయింట్​మెంట్​ ఇచ్చే వారు కాదన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు సర్పంచులు, నలుగురు వార్డు సభ్యులను పిలిపించుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బీఆర్​ఎస్​ను బండకేసి కొట్టారన్నారు.

ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Must Read
Related News