అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ (Erravelli Farmhouse)లో శనివారం ఉదయం సమావేశం అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మంగళవారం హరీశ్‌రావు (Harish Rao)ను ఏడు గంటల పాటు ప్రశ్నించారు. శుక్రవారం కేటీఆర్ (KTR)ను సైతం విచారించారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారని అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. సిట్ విచారణపై కేసీఆర్ ఇద్దరు నేతలతో చర్చించారు. విచారణ ఎలా జరిగిందని ఆరా తీసినట్లు సమాచారం.
KCR | మున్సిపల్ ఎన్నికలపై..
రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. మెజారిటీ వార్డులు, మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని గులాబీ దళం భావిస్తోంది. ఈ మేరకు కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. పురపోరుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో రెండు, మూడు రోజుల్లో షెడ్యుల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్‌తో పాటు, బీఆర్ఎస్, బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) బీఆర్ఎస్ భారీగానే స్థానాలను గెలుచుకుంది. దీంతో మున్సిపల్లో సైతం సత్తా చాటడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే సిట్ విచారణ ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఎన్నికలు ఉండటంతోనే ప్రభుత్వం కావాలని నోటీసులు ఇస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు విచారణతో పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు అంటున్నారు.