అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ (Rohit Sharma) రాణించారు. రోహిత్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాగా.. కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.
సౌత్ ఆఫ్రికా (South Africa)తో ఇటీవల జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయి వైట్ వాష్ అయింది. అయితే టెస్ట్‌లకు కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో వారు ఆడలేదు. వన్డేల్లో మాత్రమే వారు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆట కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. అభిమానుల అంచనాలకు రోహిత్, కోహ్లీ తొలిమ్యాచ్‌లో అదరగొట్టారు.
Virat Kohli | అఫ్రిది రికార్డ్ బ్రేక్
టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్, జైశ్వాల్ ఓపెనింగ్‌కు వచ్చారు. జైశ్వాల్ 18 పరుగులకే అవుట్ కాగా.. రోహిత్ శర్మ, విరాట్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి 109 బంతుల్లో 136 పరుగులు చేశారు. రోహిత్ 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సిక్స్‌ల్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అఫ్రిది (351 సిక్స్‌లు) రికార్డ్‌ను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ అధిగమించాడు. 269 ఇన్నింగ్స్‌లో 352 సిక్స్‌లు కొట్టాడు.
Virat Kohli | విరాట్ విహారం
ఆస్ట్రేలియా (Australia) గడ్డపై ఆఖరి వన్డేలో కోహ్లీ 67 పరుగులతో సత్తా చాటాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విరాట్ డకౌట్ అయ్యాడు. మూడో వన్డేలో మాత్రం రాణించాడు. కోహ్లీ చివరగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 2022లో సెంచరీ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి బ్యాట్ ఝుళింపించాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. కాగా వన్డేల్లో కోహ్లికి ఇది 52వ సెంచరీ. కోహ్లీ 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్‌తో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నారు.
