అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి శివారులో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి శివారులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసముండే యువకుడు సుతారి రాజశేఖర్(30)తో స్థానికంగా నివాసముండే గంగని ప్రవీణ్ అలియాస్ చింటూ అనే మరో యువకుడు మద్యం తాగాడు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగి అదికాస్తా కత్తిపోట్లకు దారి తీసింది.
సుతారి రాజశేఖర్‌పై గంగని ప్రవీణ్ అలియాస్ చింటూ కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. కత్తిపోట్లతో రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు వెంటనే రాజశేఖర్‌ను చికిత్స నిమిత్తం ముందుగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్ జీజీహెచ్ (Nizamabad GGH)కు తరలించారు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి రురల్ సీఐ రామన్ (Kamareddy Rural CI Raman) సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
