అక్షరటుడే, బాన్సువాడ : Kite Festival | పతంగుల పండుగను చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ (Sankranti Festival) సంబరాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు.
Kite Festival | పతంగులు ఎగురవేసిన పోచారం..
కైట్ ఫెస్టివల్లో భాగంగా పట్టణవాసులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే పోచారం (MLA Pocharam) పతంగులు ఎగురవేశారు. అనంతరం బాన్సువాడ నుంచి పండరీపూర్‌కు పాదయాత్రగా వెళ్తున్న భక్తుల బృందానికి పాత బాన్సువాడ హనుమాన్ మందిరం (Banswada Hanuman Temple) వద్ద జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, భవాని ప్రసాద్, నార్ల సురేష్, కృష్ణారెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.