అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief | కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomm Mahesh Kumar Goud) పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) చేసేందేమీ లేదన్నారు. ఏమీ చేయలేని కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహిస్తామనడం హాస్యాస్పదమన్నారు.
PCC Chief | కాంగ్రెస్‌ను ప్రజలు శభాష్ అంటున్నారు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు శభాష్ అంటున్నారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఇందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే (Jubilee Hills elections) నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. జూబ్లిహిల్స్‌లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని బీజేపీ ప్రతినిధులు మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
PCC Chief | గర్వంగా గ్లోబల్ సమ్మిట్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గర్వంగా గ్లోబల్ సమ్మిట్ జరుపుకుంటున్నామని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. కేసీఆర్ (KCR) చేసిన నిర్వాకం కారణంగా రాష్ట్రం రూ.8లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ఒకవైపు వడ్డీలు కడుతూ మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరో మూడేళ్లలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు.