అక్షరటుడే, ఇందూరు: kidneys | తాగునీటి సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోకుంటే కిడ్నీలు భారీ మూల్యం చెల్లించక తప్పదని, నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలకు తీవ్రమైన నష్టం తప్పదని నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అజయ్‌కుమార్ హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన మూత్రపిండాల సమస్య (Acute Kidney Injury – AKI) అంటే.. కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో మూత్రపిండాల పనితీరు అకస్మాత్తుగా తగ్గిపోవడమని వైద్యుడు తెలిపారు. సమయానికి వైద్య సహాయం అందించకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశముందన్నారు.
తీవ్ర డీహైడ్రేషన్ Severe dehydration, ఇన్ఫెక్షన్లు infections, తక్కువ రక్తపోటు low blood pressure, నియంత్రణలో లేని షుగర్ uncontrolled sugar, రక్తపోటు hypertension, వైద్యుల సలహా లేకుండా నొప్పి నివారణ మందుల వినియోగం, కొన్ని మందులు, కాంట్రాస్ట్ డైలు, మూత్రనాళ అడ్డంకులు (రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలు) ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
kidneys | లక్షణాలు ఇవే..
మూత్రపిండాలు సమస్యలు ఎదుర్కొంటే.. మూత్రం తగ్గిపోవడం, ముఖం–కాళ్ల వాపు, అలసట, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్త పరీక్షలు (క్రియాటినిన్, యూరియా), మూత్ర పరీక్షలు, ఎలక్ట్రోలైట్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారని వైద్యుడు వివరించారు.
కారణాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభిస్తే చాలా సందర్భాల్లో మూత్రపిండాల పనితీరు తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశముందంటున్నారు. తీవ్రమైన పరిస్థితుల్లో డయాలసిస్ అవసరం కావచ్చని చెబుతున్నారు.
సరైన నీటి వినియోగం, స్వయంగా మందులు వాడకపోవడం, షుగర్, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం, ఇన్ఫెక్షన్లకు వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని డా. అజయ్ పాటిల్ సూచిస్తున్నారు.