HomeసినిమాSrinidhi Shetty | ఆ ఇద్ద‌రు హీరోల కోసం ఏదైన చేస్తా.. రాత్రింబ‌వ‌ళ్లు కూడా క‌ష్ట‌ప‌డ‌తాన‌న్న...

Srinidhi Shetty | ఆ ఇద్ద‌రు హీరోల కోసం ఏదైన చేస్తా.. రాత్రింబ‌వ‌ళ్లు కూడా క‌ష్ట‌ప‌డ‌తాన‌న్న కేజీఎఫ్ భామ‌

Srinidhi Shetty | పాన్ ఇండియా హిట్‌తో కెరీర్ స్టార్ట్ చేసి, కాస్త గ్యాప్ తీసుకున్నా... ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో తన టాలెంట్‌తో అలరించేందుకు శ్రీనిధి సిద్ధమవుతోంది. ‘తెలుసు కదా’ విజయవంతమైతే.. ఆమెకు తెలుగులో భారీ అవకాశాలు క్యూ కట్ట‌డం ఖాయం...

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srinidhi Shetty | కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి పేరు చెప్ప‌గానే తొలుత గుర్తుకు వచ్చే సినిమా KGF. డెబ్యూ చిత్రంతోనే పాన్ ఇండియా లెవెల్‌ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ‘KGF చాప్టర్ 2’ విజయంతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది.

కానీ అందరూ ఊహించినట్టుగా వరుస సినిమాలు చేయకుండా.. తన కెరీర్‌లో చాలా సెలెక్టివ్‌గా ముందుకు వెళుతుంది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు ‘తెలుసు కదా’ సినిమాతో సిద్ధమవుతోంది. ‘హిట్ 3’ తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty), ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

నీర‌జ్ కోన దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రాశీ ఖన్నా మరో కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూల్లో “సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) కానీ.. ఇద్దరిలో ఒకరితో నటించే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారు?” అనే ప్రశ్నకు శ్రీనిధి ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ఎందుకు ఒక్కరికే పరిమితమవాలి? నాకు ఇద్దరూ కావాలి! డే అండ్ నైట్ డబుల్ కాల్షీట్స్ ఇస్తా!” అని చిరునవ్వుతో చెప్పిన ఈ సమాధానం, మహేష్ మరియు తారక్ అభిమానుల మ‌న‌సులు గెలుచుకుంది.

“షారుఖ్ ఖాన్ vs టైగర్ ష్రాఫ్?” అనే ప్రశ్నకు షారుఖ్ ఖాన్ అని వెంటనే చెప్పిన శ్రీనిధి, “చిన్నప్పటి నుంచి కింగ్ ఖాన్ అంటే నాకు స్పెషల్ ఫీలింగ్ ఉంది. చైల్డ్ హుడ్ క్రష్ లా ఫీలవుతాను” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు బొబ్బట్లు, రైస్ ఫేవరెట్ ఫుడ్స్ అని కూడా వెల్లడించింది. నాని, సిద్ధూ జొన్నలగడ్డలతో పని చేసిన అనుభవంపై మాట్లాడుతూ, “నానితో స్వీట్‌గా అనిపించింది. సిద్ధూతో ఫన్నీగా ఫీల్ అయ్యింది. ఇద్దరితోనూ చాలా కంఫర్టబుల్‌గా వర్క్ చేశా” అంటూ చెప్పింది. అలాగే తన మొదటి కో-స్టార్ అయిన యష్ గురించి కూడా స్పెషల్‌గా ప్రస్తావించింది. త్వ‌ర‌లో విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా ఎంపిక అయిందన్న వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.