అక్షరటుడే, వెబ్ డెస్క్: Pakistan market : పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అతలాకుతలంగా మారింది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం తల్లడిల్లుతోంది. పహల్ గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో పాక్ ద్రవ్యోల్బణం మరింత కొండెక్కింది.
Pakistan market : దీర్ఘకాలంలో భారీ నష్టం తప్పదు..
భారత్-పాక్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3838.53 కోట్లుగా నమోదైంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు అట్టారీ-వాఘా సరిహద్దు ప్రధాన భూమిక పోషించేది. ఇప్పుడు ఈ మార్గం మూసివేయడంతో పాకిస్తాన్ కు తక్షణ నష్టంతోపాటు దీర్ఘకాలంలో ఆర్థికంగా మరింత దిగజారే దుస్థితి ఏర్పడింది.
Pakistan market : ఆకాశాన్ని అంటుతున్న ధరలు..
పాకిస్తాన్లో ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చికెన్ కేజీ రూ. 800కు చేరుకుంది. కిలో టమాట రూ.150కి చేరింది. అరటి పండ్లు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కిలో ఆలుగడ్డలు రూ.100 దాటింది.