అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పాత రిజర్వేషన్ల (old reservations) ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రిజర్వేషన్ల ఖరారు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని జీవో జారీ చేసింది.
బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక (BC Dedication Commission report), సుప్రీం తీర్పు, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని సూచించింది. కమిషన్ సిఫార్సుల దృష్ట్యా గ్రామ పంచాయతీల వారీగా కేటాయించాల్సిన రిజర్వేషన్ల నిష్పత్తిని ఎంపిక చేయాలి. మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50 శాతం మించకూడదు.
Local Body Elections | రిజర్వేషన్ల ఖరారు ఇలా
రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే సర్పంచ్, వార్డు సభ్యుల (sarpanch and ward members) రిజర్వేషన్లు ఇంకా ప్రకటించలేదు. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందోనని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్డు స్థానాల రిజర్వేషన్లను ఎంపీడీవోలు, సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీవోలు ప్రకటించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. 2024లో నిర్వహించిన కులగణన ఆధారంగా వార్డు సభ్యుల రిజర్వేషన్ కేటాయిస్తారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు (BC reservations) కుల గణన ఆధారంగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేయనున్నారు.
