Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. గృహ ప్రవేశం ఎప్పుడంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indiramma Houses | ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారు. ఇప్పటికే గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. అయితే జనవరి 26న సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పుడు పైలట్​ ప్రాజెక్ట్​ కింద మండలానికి ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. పలువురి ఇళ్ల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indiramma Houses | ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారు. ఇప్పటికే గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. అయితే జనవరి 26న సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పుడు పైలట్​ ప్రాజెక్ట్​ కింద మండలానికి ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. పలువురి ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. ఈ క్రమంలో జూన్​ 2న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించాలని ప్రభుత్వం(Government) భావిస్తోంది.

Indiramma Houses | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(State Formation Day) సందర్భంగా జూన్ 2న మండలానికి ఒక ఇంట్లో గృహ ప్రవేశం చేయించాలని చూస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్లాబ్​ పూర్తయిన ఇళ్లలో మిగతా పనులు జూన్​ 2లోగా కంప్లిట్​ అయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

Indiramma Houses | ఇళ్ల నిర్మాణ వివరాలు..

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 20 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయి. 5,200 ఇళ్ల పనులు బేస్​మెంట్​ వరకు, 300 ఇళ్లు గోడలు పూర్తయ్యి స్లాబ్ వేయడానికి రెడీ అవుతున్నాయి. మరో 200 ఇళ్లు స్లాబ్​ కూడా పూర్తి కావడంతో ప్లాస్టరింగ్​ తదితర పనులు చేపడుతున్నారు. ఇప్పటికే అధికారులు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 53.64 కోట్లను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల(Indiramma Houses) అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది.

Indiramma Houses | హైదరాబాద్​లో టవర్లు..

జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలో ఇళ్లు లేని పేదలు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జీహెచ్​ఎంసీ పరిధిలో మొత్తం 10,66,953 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో కొంత మందికి మాత్రమే సొంత స్థలం ఉంది. మిగతా వారికి ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి బహుల అంతస్తుల్లో నిర్మాణాలు చేపట్టి ఇళ్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. సర్కారు భూముల్లో జీ ప్లస్ 3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఎకరం విస్తీర్ణంలో 300 ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. షేక్​పేట (ఖైరతాబాద్), హిమాయత్ నగర్ (ముషీరాబాద్), సైదాబాద్ (యాకుత్ పుర, మలక్ పేట) ఆసిఫ్ నగర్ (కార్వాన్, గోషామహాల్, నాంపల్లి) మారేడ్​పల్లి (సికింద్రాబాద్), తిరుమలగిరి (కంటోన్మెంట్), బండ్లగూడ (చాంద్రాయణగుట్ట) ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...