అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్‌రావు (Prabhakar Rao)పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబమే పోన్ ట్యాపింగ్ (Phone Tapping)కు పాల్పడిందని బండి సంజయ్ ఆరోపించారు. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత తనతో పాటు భర్త ఫోన్ ట్యాప్ అయిందని చెప్పినట్లు గుర్తు చేశారు. ట్యాపింగ్‌కు భయపడి హరీశ్‌రావు (Harish Rao) ఏడాది పాటు ఫోన్ వాడలేదన్నారు. హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి లాభపడ్డారని చెప్పారు. వ్యాపారుల ఫోన్లను సైతం వదలలేదన్నారు. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్లు చేతులు మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎలక్ట్రోర్ బాండ్ల పేరుతో కోట్లు వసూలు చేసిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో బిచ్చగాళ్లు సైతం వాట్సాప్ కాల్ మాట్లాడుకునే పరిస్థితి ఉండేదన్నారు.
Bandi Sanjay | సిట్ ఏం సాధించింది
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఏం సాధించిందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. హరీశ్‌రావును అధికారులు ఎందుకు విచారించారన్నారు. ఆయన ఫోన్ ట్యాప్ అయినందుకా.. ఇతరుల ఫోన్ ట్యాప్ చేసినందుకా అనే విషయాలు తెలుపాలని డిమాండ్ చేశారు. గతంలో తనను సిట్ విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసిందని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు చెప్పారని, కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని, పారాశ్రామిక వేత్తలను బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారన్నారు.
Bandi Sanjay | కొండను తవ్వి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావును కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని బండి సంజయ్ అన్నారు. విచారణ పేరిట హడావుడి చేస్తున్న సిట్ ఎంత మందిని అరెస్ట్ చేసిందన్నారు. ఈ కేసులో ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)ను అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కొండను తవ్వి ఎలుకను పట్టుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు. సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తప్పు చేసిన పోలీసులు, అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలన్నారు.