అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Seethakka | కేసీఆర్ (KCR) హయాంలో వేములవాడ రాజన్న, మేడారం ఆలయాలను పట్టించుకోలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె వేములవాడ (Vemulawada)లో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ ఆలయాన్ని దర్శించుకున్నారు. రాజన్నకు కోడె ముక్కులు చెల్లించుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 19న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా సమ్మక్క-సారలమ్మ గద్దెల పునః ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని రాజన్నను కోరినట్లు మంత్రి చెప్పారు.
Minister Seethakka | వైభవంగా జాతర
సమ్మక్క సారలమ్మ గుడి (Sammakka Saralamma Temple)ని సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వేములవాడలో సైతం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రెండు ఆలయాలను పట్టించుకోలేదని విమర్శించారు. నాలుగు రోజుల పాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాజన్న గుడి అభివృద్ధి కావడానికి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి కారణమన్నారు. ఆమె వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎండోమెంట్ అధికారులు ఉన్నారు.