అక్షరటుడే, భీమ్‌గల్: Kalvakuntla kavitha | భీమ్‌గల్ మండలంలోని లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహ స్వామిని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kalvakuntla kavitha | రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేశాయ్..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేశాయని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. లింబాద్రి గుట్టపై (Limbadri Gutta) దర్శనం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంంక్షలు తెలియజేశారు. లింబాద్రి గుట్టపై మొదట వేపచెట్లు ఉండేవి కనుక నింబాద్రి అనేవాళ్లని.. తర్వాత కాలక్రమేణా లింబాద్రిగా పేరు వచ్చిందన్నారు. లింబాద్రి లక్ష్మీనృసింహాస్వామి చాలా శక్తివంతమైన దేవుడని పేర్కొన్నారు.
Kalvakuntla kavitha | కీలకమైన వ్యక్తులు ఉన్నా ఏం లాభం..
పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ (PCC chief Bomma Mahesh Kumar Goud) భీమ్‌గల్ మండలానికి చెందిన వారేనని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అలాగే మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఈ ప్రాంతం వారేనన్నారు. ఇక ఇక్కడి ఎమ్మెల్యే విషయం పక్కన పెడితే.. ఈ మండలం నుంచి కీలకమైన వ్యక్తులు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ రైతుల (farmers) గోస పట్టట్లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడ ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులదే నడుస్తోందని అయినప్పటికీ రైతులు ధాన్యం విషయంలో ఇన్ని అవస్థలు పడుతున్నా ఎందుకు పట్టట్లేదని ఆమె ప్రశ్నించారు.
Kalvakuntla kavitha | 80 శాతం మక్కలు అమ్ముడయ్యాక..
రాష్ట్రంలో 80 శాతం అమ్మకాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం దారుణమని కవిత వ్యాఖ్యానించారు. రైతులు (farmers) నష్టానికి దళారులకు మొక్కలను అమ్ముకున్న తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ధాన్యం రైతు దారుణం పరిస్థితి రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతు పరిస్థితి దారుణంగా తయారైందని కవిత పేర్కొన్నారు. తడిసిన ధాన్యం కొనేవాళ్లు లేక వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దాన్యం కొంటామని స్పష్టంగా చెప్పకపోవడంతో రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారని ఆమె వ్యాఖ్యానించారు.
మొన్నటికి మొన్న తాను నవీపేట్ మండలం (Navipet mandal) యంచ గ్రామాన్ని సందర్శించిన తర్వాత కలెక్టర్ అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడారని అలాగే అన్ని ప్రాంతాల్లోనూ కలెక్టర్ పర్యటించి రైతుల పరిస్థితి తెలుసుకోవాలని ఆమె కోరారు. బాల్కొండ ప్రాంతంలో చెక్ డ్యాంలు పూర్తిగా డ్యామేజ్ కావడంతో పంట పొలాలు మునిగిపోయాయని ఆమె పేర్కొన్నారు.
Kalvakuntla kavitha | ఈ ప్రాంతం ఎమ్మెల్యే నిలదీయాలి
స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కవిత పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయాలని సూచించారు. కేసీఆర్ లక్ష్మీనృసింహస్వామి (Lakshmi Narasimha Swamy) భక్తుడని.. గతంలో లింబాద్రి స్వామి వారికి రూ. 5 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నామని.. కానీ గుట్టపై మహిళలకు టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాల్సి ఉంది. గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పూర్తి కావడానికి రూ. 20 లక్షలు అవసరముందని ప్రభుత్వం వాటిని కేటాయించాలని కోరారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
