Kalvakuntla Kavitha | సీఎం జిల్లాల పర్యటనపై కవిత ఆగ్రహం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | సీఎం రేవంత్​రెడ్డి జిల్లాల పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం సీఎం పర్యటిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్​’ వేదికగా పోస్ట్​ చేశారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటన పట్టణ ప్రాంతాల్లోనే ఉండనుంది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | సీఎం రేవంత్​రెడ్డి జిల్లాల పర్యటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం సీఎం పర్యటిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్​’ వేదికగా పోస్ట్​ చేశారు.

ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటన పట్టణ ప్రాంతాల్లోనే ఉండనుంది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) మక్తల్​లో సభ నిర్వహించనున్నారు. 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్​లో, 4న ఆదిలాబాద్​లో, 5న నర్సంపేట, 6న నల్గొండ జిల్లా (Nalgonda District) దేవరకొండలో పర్యటిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎం పర్యటనలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ముతో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.

Kalvakuntla Kavitha | ఎన్నికల సంఘం స్పందించాలి

ఎన్నికలు గ్రామాల్లో ఉంటే .. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట అని ఆమె అన్నారు. అక్కడికి జిల్లా ప్రజలందరినీ ప్రభుత్వం సొమ్ముతో తరలించి తమ సందేశం ఇస్తారట అని ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ (Election Commission) ఈ విషయంలో జోక్యం చేసుకుని, ముఖ్య మంత్రి పర్యటనను నిలిపివేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్‌ను పాటించడమే కాకుండా దాని వెనుక ఉన్న స్ఫూర్తిని కూడా పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...