Homeజిల్లాలుకామారెడ్డిKavitha Kamareddy Tour | కామారెడ్డిలో కవిత పర్యటన.. రేపటి షెడ్యూల్​ ఏమిటంటే..!

Kavitha Kamareddy Tour | కామారెడ్డిలో కవిత పర్యటన.. రేపటి షెడ్యూల్​ ఏమిటంటే..!

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్వకుంట్ల కవిత కామారెడ్డి పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం కవులు, మేధావులతో కవిత సమావేశం కానున్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kavitha Kamareddy Tour | తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత Telangana Jagruti founding president Kalvakuntla Kavitha గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు.

ఇటీవల రైలు ప్రమాదం నుంచి జీవాల(గొర్రెలు)ను కాపాడబోయి ప్రమాదవశాత్తు మరణించిన చెందిన దేవునిపల్లి గొర్ల కాపరి దర్శపు సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. పిల్లలు చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని, ఆదుకోవాలని ఆమెను కుటుంబ సభ్యులు వేడుకున్నారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Kavitha Kamareddy Tour | గ్రాండ్ వెల్ కం

తాడ్వాయిలో శబరిమాత ఆశ్రమం దర్శించుకున్న అనంతరం కవిత కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. దేవునిపల్లి దేవివిహార్ వద్ద కవితకు జాగృతి శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

ఆటోలు, బైక్ ర్యాలీ నిర్వహించారు. దేవునిపల్లిలో సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Kavitha Kamareddy Tour | రేపటి పర్యటన వివరాలు..

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్వకుంట్ల కవిత కామారెడ్డి పట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం కవులు, మేధావులతో కవిత సమావేశం కానున్నారు.

అనంతరం కామారెడ్డి పట్టణంలో వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీలలో పర్యటించి వరద బాధితులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు జాగృతి ప్రతినిధులు తెలిపారు.