అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha Fires on CM | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలమ జాతిపై ఆయన వ్యాఖ్యలను ఖండించారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బుధవారం మిర్యాలగూడ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యులపై విమర్శలు చేశారు. అంతేగాకుండా వెలమ కమ్యూనిటీపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా కవిత స్పందించారు. రేవంత్‌రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని మండిపడ్డారు. వెలమ జాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అన్ని కులాలు, మతాలను సమానంగా చూడాల్సిన సీఎం వెలమలను టార్గెట్ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక సీఎం ఇలా విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
Kavitha Fires on CM | ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ (Jagtial MLA Sanjay) తన పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆయన సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం అందరికీ తెలుసన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఆయన వర్గానికి చెందిన 30 మందికి ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంలను అందించారన్నారు. గాంధీ భవన్ (Gandhi Bhavan)లో సమావేశాలకు హాజరు అవుతున్నారని చెప్పారు. అలాంటి వ్యక్తి పార్టీ మారినట్లు ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదన్నారు. సంజయ్‌కి నిజాయితీ ఉంటే పదవికి రాజీనామా చేయాలన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు.
Kavitha Fires on CM | జాగృతి బలోపేతంపై..
కల్వకుంట్ల కవిత జాగృతి బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలతో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీ, యూత్, రెవెన్యూ రిఫార్మ్స్, కల్చరల్ కమిటీలతో గురువారం ఆమె భేటీ అయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన కోసం 50 అధ్యయన కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీల నివేదికలతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, నిపుణుల సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు కవిత తెలిపారు.