అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karnataka DGP | కర్ణాటకలో డీజీపీ రాసలీలలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆఫీస్‌లోనే ఆయన పలువురు మహిళలతో అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతున్నాయి.
సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అధిపతిగా ఉన్న డీజీపీ రామచంద్రరావు (DGP Ramachandra Rao) కొనసాగుతున్నారు. ఆయన తన కార్యాలయంలో ముగ్గురు మహిళలతో రాసలీలలు చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. యూనిఫామ్‌లో ఉండి అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డట్లు అందులో ఉంది. కాగా డీజీపీ రామచంద్రరావు గతంలో తన సవతి కుమార్తె రాన్యా రావుకు బంగారు స్మగ్లింగ్ కేసులో సహాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ కేసుతో ఆయనను ప్రభుత్వం గతంలో సెలవుపై పంపింది. ఇటీవల ఆ తప్పనిసరి సెలవు ఉత్తర్వును రద్దు చేసి ఆయన్ను సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా బదిలీ చేసింది.
Karnataka DGP | విచారణకు ఆదేశం
రామచంద్రారావు రాసలీలల వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) వరకు చేరింది. దీంతో ఆయన ఈ వీడియోలపై విచారణకు ఆదేశించారు. వీటిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక అధికారి ఇలా కార్యాలయంలో మహిళలతో అనుచితంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Karnataka DGP | స్పందించిన డీజీపీ
వీడియోలు వైరల్ కావడంతో డీజీపీ రామచంద్రారావు స్పందించారు. ఆ వీడియోలు తనవి కావని చెప్పారు. ఏఐతో సృష్టించారన్నారు. ఇదంతా ఫేక్.. తనకే షాకింగ్‌గా ఉందన్నారు. ఆ వీడియోలు ఎవరు తీశారో.. ఎప్పుడు తీశారో తనకేమి తెలియదన్నారు. అసలు జరిగి ఉంటే కదా అన్నారు. ఈ విషయంపై ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన హోంమంత్రి పరమేశ్వరను కలిసి వివరించారు. తన ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన కుట్రగా ఆయన ఈ సంఘటనను అభివర్ణించారు.