HomeసినిమాKamna Jethmalani | పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ హీరోయిన్.. ‘కే-ర్యాంప్’తో వెండితెరపై...

Kamna Jethmalani | పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ హీరోయిన్.. ‘కే-ర్యాంప్’తో వెండితెరపై సందడి

Kamna Jethmalani | పదేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న కామ్నా జెఠ్మలానీ పాత్ర కె ర్యాంప్‌ సినిమాలో ఎంత ప్రాధాన్యతను కలిగి ఉంది? ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంద‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kamna Jethmalani | టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జెనీలియా, లయ, అనిత, అన్షు వంటి భామలు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించగా, ఇప్పుడు మరో సీనియర్ బ్యూటీ కామ్నా జెఠ్మలానీ (Kamna Jethmalani) కూడా అదే బాటలో ప‌య‌నిస్తున్నారు.

దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆమె తిరిగి వెండితెరపై కనిపించబోతున్నారు. కామ్నా ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కే-ర్యాంప్’ సినిమాలో (K-Ramp Movie) కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో కామ్నా త‌ళుక్కున మెర‌వ‌గా, సీనియర్ నటుడు నరేష్ ఆమె వెనకపడుతున్నట్టుగా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఏ పాత్రలో నటించనున్నారు? ఎంత సేపు కనిపిస్తారు? అన్న విషయం అక్టోబర్ 17న సినిమా విడుదల తర్వాత స్పష్టత రానుంది.

Kamna Jethmalani | పెళ్లి తర్వాత బ్రేక్..

కామ్నా జెఠ్మలానీ 2005లో ‘ప్రేమికులు’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో (Telugu Industry) అడుగుపెట్టారు. తర్వాత కోలీవుడ్‌లో ‘ఇదయా తిరుడన్’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. టాలీవుడ్‌లో గోపిచంద్ సరసన నటించిన ‘రణం’ చిత్రంతో మంచి హిట్ కొట్టారు. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే, వివాహం తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన కామ్నా.. చివరిసారి తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘చంద్రిక’ (2015)లో కనిపించారు. అనంతరం సినిమాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్న ఆమె, రెండు సంవత్సరాల క్రితం ZEE5లో స్ట్రీమింగ్ అయిన వెబ్‌సిరీస్ ‘వ్యవస్థ’లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమాలలోకి పునరాగమ‌నం చేస్తోంది.

అయితే కే ర్యాంప్ చిత్రం విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా, జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ మరియు శివ బొమ్మక కలిసి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రాగా, చిత్రం కూడా మంచి హిట్ కొడుతుంద‌ని ఆశిస్తున్నారు.

Related News