అక్షరటుడే, కామారెడ్డి: Cricket Selections | హెచ్సీఏ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం అండర్–14 క్రికెట్ ఎంపికలు (Under-14 cricket selections) నిర్వహించారు. ఈ ఎంపికల్లో కామారెడ్డికి (Kamareddy) చెందిన నలుగురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు.
కామారెడ్డికి చెందిన కార్తికేయ, మణికంఠ, సాయి అక్షిత్, మహమ్మద్ అర్హన్లు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు క్రికెట్ కోచ్ రియాజుద్దీన్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో అండర్–14 విభాగంలో ఒకరు సెలక్ట్ కాగా.. ఈసారి నలుగురు సెలక్ట్ కావడం అభినందనీయన్నారు.
