అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | వరిధాన్యం సేకరణలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ (Civil Supplies Department) మంత్రి ఉత్తమ్ కుమార్ (Minister Uttam Kumar) చేతుల మీదుగా సివిల్ సప్లయ్ అధికారులు కమెండేషన్ సర్టిఫికెట్లు పొందారు.
Kamareddy | రాష్ట్రంలో 32 వరిసేకరణ జిల్లాల పనితీరు..
రాష్ట్రంలోని 32 వరి సేకరణ జిల్లాల పనితీరును సివిల్ సప్లయ్ కమిషనర్ సమీక్షించారు. అలాగే ధాన్యం సేకరణ, సయోధ్య, ఎఫ్సీఐ క్లెయిమ్‌లు (FCI claims) తదితర ఐదు వేర్వేరు కేటగిరీల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐదు జిల్లాలను ఎంపిక చేశారు. ప్రతి విభాగంలో మెరుగైన పనితీరు కనబర్చిన జిల్లాలను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రశంసించారు. ఈ క్రమంలో రైతులకు సకాలంలో ఎంఎస్పీ చెల్లింపులు విభాగంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
Kamareddy | మూడురోజుల్లోనే రైతులకు చెల్లింపులు..
రైతులకు మూడు రోజుల్లోపు చెల్లింపులు పూర్తిచేయడం ద్వారా జిల్లా అద్భుతమైన పనితీరును కనబర్చినందుకు కామారెడ్డి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్‌లకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాణహిత హాల్‌లో కమెండేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డీసీఎస్వో డీఎం మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ మార్గనిర్దేశం సంబంధిత అధికారుల సమన్వయ కృషి ఫలితంగానే కామారెడ్డి జిల్లా వరి సేకరణలో రాష్ట్రస్థాయి గుర్తింపును సాధించిందని తెలిపారు.