Homeజిల్లాలుకామారెడ్డిBC Declaration | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి

BC Declaration | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం ప్రతినిధులు డిమాండ్​ చేశారు. పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration | కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో (Kamareddy BC Declaration) పేర్కొన్న అంశాలను అమలు చేయాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు పున్న రాజేశ్వర్, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గజ్జల భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముదిరాజ్​లను బీసీ–డీ గ్రూప్​ నుంచి బీసీ–ఏ గ్రూప్​లోకి మార్చిన జీవోను పునరుద్ధరించాలని కోరారు. పోలీసు కిష్టయ్య మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడని, తన ప్రాణాలను సైతం తెలంగాణ కోసం అర్పించాడని కొనియాడారు. పోలీస్ కిష్టయ్య ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కామారెడ్డి జిల్లాను పోలీస్ కిష్టయ్య జిల్లాగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు నాగరాజు, భూపాల్ గోపాల్, సుశీల్ రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News