MNM Party | అసెంబ్లీ ఎన్నికలపై ఎంఎన్‌ఎం దృష్టి .. కమల్‌ హాసన్ పార్టీ ఎన్ని స్థానాల‌లో పోటీ చేయ‌నుందంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MNM Party | తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారేందుకు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ సీరియస్‌గా వ్యూహాలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఉన్న ఎంఎన్‌ఎం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం డీఎంకేతో సీట్ల స‌ర్ధుబాటు చేస్తుంది. ఇప్పటికే పార్టీ కీలక నేతలతో నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించిన కమల్ హాసన్ (Kamal Haasan), నెక్ట్స్ ఎలెక్షన్‌కు దిశానిర్దేశం చేశారు. ఎంఎన్‌ఎం ఈసారి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MNM Party | తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారేందుకు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ సీరియస్‌గా వ్యూహాలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఉన్న ఎంఎన్‌ఎం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం డీఎంకేతో సీట్ల స‌ర్ధుబాటు చేస్తుంది.

ఇప్పటికే పార్టీ కీలక నేతలతో నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించిన కమల్ హాసన్ (Kamal Haasan), నెక్ట్స్ ఎలెక్షన్‌కు దిశానిర్దేశం చేశారు. ఎంఎన్‌ఎం ఈసారి ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో మంచి ఓటింగ్ శాతం సాధించిన నియోజకవర్గాలను గుర్తించి, ఆ స్థానాలను తమకు కేటాయించేలా డీఎంకేపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉంది.

MNM Party | క‌మ‌ల్ వ్యూహాలు..

2021 శాసనసభ ఎన్నికల్లో పార్టీ 39 స్థానాల్లో పోటీచేసి, 9 శాతం ఓట్లను సాధించింది. 8 నియోజకవర్గాల్లో 10 శాతం మించి ఓట్లు రాబట్టగా, 71 నియోజకవర్గాల్లో 5 వేలకుపైగా ఓట్లు గెలుచుకుంది. కోయంబత్తూరులో స్వయంగా పోటీ చేసిన కమల్‌ హాసన్‌ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతిచ్చిన ఎంఎన్‌ఎం (MNM Party), ముందస్తు ఒప్పందం ప్రకారం రాజ్యసభ స్థానాన్ని పొందింది. ఇప్పుడు ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 10కి పైగా సీట్లు కేటాయించాలనే డిమాండ్‌ను తీసుకొస్తోంది. పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా కమల్‌కు తెలిపారు.

నాయకుల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న కమల్ హాసన్, పార్టీకి తగినంత ప్రాతినిధ్యం లభించేలా డీఎంకేతో చర్చలు జరిపి, అవసరమైన సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. “ఇది పార్టీ బలాన్ని నిరూపించుకునే సమయం. మనం పోటీచేసే నియోజకవర్గాల్లో విజయం సాధించేలా కృషి చేయాలి,” అని ఆయన అన్నారు. తమిళనాడులో రాజకీయంగా పట్టు సాధించాలన్న కమల్ హాసన్ ఆశయానికి దోహదపడేలా ఎంఎన్‌ఎం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఓటు శాతం పెంచుకున్న పార్టీ, డీఎంకే కూటమిలో మరింత ప్రభావం చూపించేందుకు కసరత్తు ప్రారంభించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...