అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ Kaleshwaram Commission విచారణలో భాగంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారించేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు former cm kcr నోటీసులు ఇచ్చింది. కేసీఆర్‌తో పాటు అప్పుడు మంత్రులుగా పని చేసిన హరీశ్‌రావు harish rao, ఈటల రాజేందర్ etala rajendarకు నోటీసులు పంపింది. ఆ సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.
Kaleshwaram Commission | అందుకోసమే గడువు పొడిగింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్ Kaleshwaram project లో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్ ఘోష్ justice gosh కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే అప్పటి ఈఎన్సీలను, కీలక అధికారులను, పనులు చేపట్టిన సంస్థ ప్రతినిధులను విచారించింది. ఈ క్రమంలో విచారణ పూర్తయి నివేదిక ప్రభుత్వానికి అందించే తరుణంలో ప్రభుత్వం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కమిషన్ తాజాగా కేసీఆర్, హరీశ్‌రావు, ఈటలకు నోటీసులు ఇవ్వడం గమనార్హం.
Kaleshwaram Commission | కేసీఆర్ చెప్పినట్లే చేశాం..
బీఆర్ఎస్ brs హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. తానే దగ్గరుండి ప్రాజెక్ట్ పనులు చేపట్టినట్లు మాజీ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. ఇదే విషయాన్ని అధికారులు సైతం కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. ప్రాజెక్ట్ డిజైన్ మార్పు, బ్యారేజీల ఖరారు, నీటి నిల్వ సామర్థ్యం విషయంతో కేసీఆర్ సూచించిన విధంగానే తాము చేసినట్టు వారు చెప్పారని సమాచారం. దీంతోనే కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Kaleshwaram Commission | వివరణ తీసుకోవడం కోసం..
కేసీఆర్ చెప్పినట్లే ప్రాజెక్ట్‌లో మార్పులు చేశామని అధికారులు చెప్పడంతో కమిషన్ ఆ మేరకు నివేదిక తయారు చేసినట్లు తెలిసింది. ప్రాజెక్ట్ కుంగుబాటు, అక్రమాలకు కేసీఆరే కారణమని నివేదిక రూపొందించినట్లు సమాచారం. అయితే ఆయన వివరణ తీసుకోకుండా ఆయనను దోషిగా పేర్కొనడం సరికాదని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
Kaleshwaram Commission | విచారణకు హాజరు అవుతారా..
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కాలేదు. తనను విచారించే అధికారం కమిషన్‌కు లేదని కేసీఆర్ కోర్టుకు వెళ్లి విజయం సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు కాళేశ్వరం విచారణకు హాజరు అవుతారా.. లేక మళ్లీ కోర్టుకు వెళ్తారా అనేది చూడాలి.